15-05-2025 10:02:09 PM
బిజెపి నాయకులు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలు దగ్ధం..
హుజురాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ నాయకులకు పరిపాలన చేతగాక మాటలతో ఎదురుదాడి చేస్తున్నారని బిజెపి నాయకులు జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, ఇల్లందకుంట మండల సీనియర్ నాయకుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో, ఇల్లందకుంట మండల కేంద్రంలోని గరుడ చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డిలు, మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటిదని ప్రశ్నించారు.
తెలంగాణలో కుల గణన చేసామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈటెల రాజేందర్ ని ఏ కులం అని అడగడం సిగ్గుచేటు అన్నారు. కులగన చేసేటప్పుడు ఈటెల ఏ కులం ఏంటిదో అని తెలియదా అని అన్నారు. కులగలన అంతా ఒక బూటకం అని, కుల గణన సర్వేలో దృశ్యానికి మతం భారీని తక్కువగా చూపించడమే కాకుండా ముస్లింలను బీసీలలో కలిపి ఈ రాష్ట్రానికి సమాజానికి నష్టం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జగ్గారెడ్డి పిచ్చి పట్టిన కుక్కలాగా అరుస్తాడే తప్ప సబ్జెక్టు లేదని అన్నారు, సీఎం రేవంత్ రెడ్డి పైనే ఇష్టానుసారంగా మాట్లాడే సంస్కారం లేని నాయకుడు జగ్గారెడ్డి అని అన్నారు. ఇష్టానుసారంగా మా నాయకులపై నోరు పాడేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రాజు, సునీల్ గౌడ్, మహమ్మద్ పాషా, మధు, ఎండి షఫీ, కందాల రాజేందర్, మట్ట పవన్ రెడ్డి, ఓంకార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.