31 July, 2026 | 4:57 PM

గుర్రంగడ్డ ప్రజల సమస్యలను సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా...

24-08-2024 07:34 PM

ఆర్ఓ ప్లాంట్, బిసి కమిటీ హాల్, గ్రామాన్ని సందర్శన 

జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరిత...

వనపర్తి,( విజయక్రాంతి): గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా గుర్రంగడ్డ ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గద్వాల మండల పరిధిలోని గుర్రంగడ్డ గ్రామాన్ని మరియు తన హయాంలో జెడ్పి నిధుల మంజూరు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్, బిసి కమిటీ హాల్ లను సందర్శించేందు బీరెల్లీ ఒడ్డున నుంచి గుర్రంగడ్డ గ్రామానికి బోటు లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రయాణం చేశారు. గ్రామంలోని నడిగడ్డ ఇలవేల్పు జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకొని,మొక్కలు నాటి గ్రామస్థులతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో గుర్రంగడ్డ గ్రామానికి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం లోనైన న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నట్లు గ్రామస్థులు సరితమ్మకు తెలిపారు. ఈ సందర్బంగా సరిత మాట్లాడుతూ గ్రామస్థుల సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే సిఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి గుర్రంగడ్డ ప్రజల యొక్క ప్రధాన సమస్య అయిన బ్రిడ్జ్ పనులను పూర్తి చేయించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేర్చడానికి కృషి చేస్తానని సరితమ్మ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. అలాగే బిసి కమిటీ హాల్ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.