నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థుల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త రంగ ప్రశాంత్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి, ప్రీతంను కోరారు. నూతనంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాగరి, ప్రీతమ్, లీగల్ సెల్ వైస్ చైర్మన్, న్యాయవాది కాంపెల్లి ఉదయ కాంత్ లను శనివారం హైదరాబాదులోని సంజీవయ్య సంక్షేమ భవన్లో కలిసి సన్మానించారు. కార్పొరేషన్ సబ్సిడీ రుణాలను నిరుద్యోగులకు వచ్చే విధంగా చూడాలని కోరారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కి అనుగుణంగా బెల్లంపల్లి పట్టణంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో పగిడిపల్లి రామచంద్రయ్య, ఉమ్మడి మెదక్, కరీంనగర్ ఇన్చార్జి చౌదరి విక్రమ్, హైదరాబాద్ సిటీ ఇన్చార్జి జన్ను రామకృష్ణ లు పాల్గొన్నారు.






