2 May, 2026 | 6:53 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

రెండవ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి

28-11-2024 06:34 PM

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వైద్య ఆరోగ్య శాఖలో రెండవ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా వైద్యాధికారి సీతారాం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ ఏఎన్ఎం పోస్టులను ఐదువేలకి పెంచడంతోపాటు ప్రిపరేషన్ హాలిడేస్ మంజూరు చేయాలని కోరారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు 20 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ వారికి వచ్చే వేతనాలతో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దివాకర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సంతోషి, ప్రధాన కార్యదర్శి పుణ్యవతి,రజని, సునీత ,భాగ్య ,బుజ్జి, తదితరులున్నారు.