2 May, 2026 | 7:15 PM

మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ

02-05-2026 06:04 PM

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): జీవీకే ఈఎమ్ఆర్ ఐ ఉమ్మడి జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ నజీరుద్దీన్ ఆధ్వర్యంలో తల్లాడ లో నిర్వహిస్తున్న 108 సిబ్బంది శిక్షణ తరగతులలో ఆళ్ళపల్లి 108 సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పైలెట్ సునీల్ కుమార్ మాట్లాడుతూ... ఈ శిక్షణ ద్వారా అత్యవసర సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారినీ రక్షించేందుకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందని ముఖ్యంగాఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సి పి ఆర్, ప్రాథమిక చికిత్స, గాయాలు, గుండెపోటు, రోడ్డు ప్రమాదాల్లో తక్షణ స్పందన ఆక్సిజన్ ఇవ్వడం, వెంటిలేటర్ వాడకం, ఐ వి  ఫ్లూయిడ్స్ ఇవ్వడం వంటి వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగిందని

అలాగే పైలెట్ అంబులెన్స్ సురక్షితంగా నడపడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ జిపిఎస్, నావిగేషన్, తక్కువ సమయంలో ఘటనా స్థలానికి చేరడంవాహన నిర్వహణ, ప్రాథమిక మరమ్మతులు వంటి విషయాలపై శిక్షణ అందించడంతో పాటు 108 కాల్ సెంటర్‌తో సమన్వయం రోగి బంధువులతో మాట్లాడే విధానం, ధైర్యం చెప్పడం అలాగే హాస్పిటల్‌కు ముందస్తు సమాచారం ఇవ్వడం గురించి శిక్షణ అందించడం జరిగిందని ప్రతి 3-6 నెలలకు ఒకసారి కొత్త పద్ధతులు, పరికరాలపై అప్‌డేట్ ట్రైనింగ్ శిక్షణ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ స్పెషల్ ట్రైనింగ్ గర్భిణీ స్త్రీల డెలివరీ, పాము కాటు, కాలిన గాయాలు, విష ప్రభావం వంటి కేసుల నిర్వహణ. పై పూర్తిస్థాయిలో శిక్షణ  ఈ శిక్షణ పొందడం జరిగిందని ఈ శిక్షణ ద్వారా ఎమర్జెన్సీ సేవలను మరింత వేగవంతంగా అందించి ప్రాణాపాయ స్థితిల ఉన్న వారిని రక్షించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు బబ్లు ఆకాష్ తదితరులు పాల్గొన్నారు