7 May, 2026 | 9:39 AM

థియేటర్ల సమస్యలు పరిష్కరించాలి

24-05-2024 12:05 AM

తెలంగాణలో సింగిల్ సినిమా థియేటర్లను మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవడంతో సామాన్య ప్రేక్షకుడికి సినిమా కూడా అందని మానిపండయిపోయింది. థియేటర్లు కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండడం,  బెనిఫిట్ షోలు, అదనపు ఆటలతో సినీ పరిశ్రమను జూదంగా మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మల్టీప్లెక్స్‌లకు వెళ్లి సినిమా చూసే స్థోమత లేని వాళ్లకు ఇది పెద్ద ఆశాభంగమే. కనుక త్వరగా ఈ సమస్య పరిష్కారమైతే మంచిది.

- జి.నరేశ్ గౌడ్, యాప్రాల్