calender_icon.png 6 February, 2026 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి గర్భంలో ఉండగానే సమస్యలు

06-02-2026 12:58:07 AM

ముందస్తు గుర్తింపుతో ప్రాణ రక్షణ

మెడికవర్ హాస్పిటల్స్ వైద్యుల వెల్లడి 

నిజామాబాద్ జిల్లాలో హైరిస్క్ గర్భధారణలు, నెలలు నిండని శిశువులకు ప్రత్యేక వైద్యం

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో హైరిస్క్ గర్భధారణలు, అకాల ప్రసవాలు, నెలలు నిండని శిశువులకు సమయానుకూలంగా ప్రత్యేక వైద్యం అందకపోవడం తల్లి, శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని హైదరాబాద్‌లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సీనియర్ నీయోనేటాలజిస్ట్ డా. రవీందర్ రెడ్డి పరిగె, పీడియాట్రిక్ సర్జన్ డా. మధుమోహన్, తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. నెలలు నిండని శిశువుల జీవన శాతం, వారి దీర్ఘకాలిక అభివృద్ధి ఆధునిక వైద్య సదుపాయా లతో పాటు, సమయానుకూల నిర్ణయాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, విభాగాల మధ్య సమన్వయంపై ఆధారపడి ఉంటాయని తెలిపారు.

23 వారాల్లో జన్మించిన శిశువు లకు ఆధునిక శ్వాస సహాయం, ఇన్ఫెక్షన్ నియంత్రణ, పోషకాహార నిర్వహణ మరి యు నిరంతర పర్యవేక్షణ అత్యంత అవసరమని పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్లో అత్యాధునిక ఎన్‌ఐసీయూ సదుపాయాలు, 24 గంటల నీయోనేటాలజీ సేవలు, పీడియాట్రిక్ సర్జరీ మద్దతు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సాక్ష్యాధారిత చికిత్సా విధానాలు మరియు కఠినమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యల ద్వారా అకాల శిశువుల్లో మెరుగైన చికిత్సా ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు.