calender_icon.png 29 July, 2025 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంతల రోడ్డుతో అవస్థలు

29-07-2025 02:13:38 AM

పటాన్ చెరు/జిన్నారం, జూలై 28 : జిన్నారం మండలంలోని శివనగర్ నుంచి కంజర్ల చౌరస్తా మీదుగా పటాన్ చెరు వెళ్లే రోడ్డు గుంతలు తేలడంతో గత రెండు సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తున్నామని శివనగర్ గ్రామస్తులు సోమవారం  తెలిపారు. కంజర్ల చౌరస్తా నుంచి శివనగర్ పరిధి వరకు కంకర రోడ్డు పూర్తిగా దెబ్బతిందని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో కార్లు, బైకులు వెళ్లలేని దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

తప్పని పరిస్థితుల్లో ఇదే రోడ్డు నుంచి ఉద్యోగ ఉపాధి కోసం పటాన్చెరు వెళ్లే వారి వెన్నుపూసలు కదిలిపోతున్నాయి అన్నారు.  సమస్యను సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు విన్నవిస్తూనే ఉన్న ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ రోడ్డు మీదుగా వెళ్లలేక మరో మార్గాన్ని కొందరు ఎంచుకుంటున్నారు.