29-07-2025 02:12:31 AM
బెజ్జంకి, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండలం సి ఎన్ హెచ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని అన్నారు, టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని , టిఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులకు దళిత బంధు మూడు ఎకరాల భూమి ఇవ్వడంలో విఫలమైందని ఆరోపించారు.
మండలంలోని 230 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించడం జరిగిందని,రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ రెండో విడతలో 671 మంది లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించారు.
గత ప్రభుత్వంలో సన్న బియ్యం లబ్ధిదారులకు ఇవ్వలేదని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం,ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
అభివృద్ధి పనులు శంకుస్థాపన ప్రారంభం
బెజ్జంకి బాలుర పాఠశాలలో నూతన భవిత సెంటర్ సర్వ శిక్ష అభియాన్ 7లక్షల 15 వేలతో నిధులతో భావన నిర్మాణానికి భూమి పూజ చేసారు,రాంసాగర్ ,దాచారం గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. దాచారంలో, సిసి రోడ్ అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలో వంటశాల ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఓ తనూజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, తాహాసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిసరత్నాకర్ రెడ్డి, పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జల్ల ప్రభాకర్, బైరి సంతోష్,, అక్కర వేణు పోచయ్య,శ్రీనివాస్, కుమార్, శరత్, డీలర్లు బొల్లం పెద్దన్న, చింతకింది వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.