calender_icon.png 29 July, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిటీహాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్

29-07-2025 02:15:03 AM

రామచంద్రపురం, జూలై 28 : రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఎంపీ ల్యాండ్స్, సీడీపీ, సీఎస్‌ఆర్ నిధులతో రూ.1.30 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన  కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలోని ప్రజలందరికి ఉయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ ఉపయోగపడుతుందని, ముఖ్యంగా బీద, పేద ప్రజలకి అందుబాటులో ఉంటుందన్నారు. దీనిని పూర్తస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

కమ్యూనిటీ హాల్ లో పెండింగ్  పనులు ఉంటే వాటిని త్వరలోనే పూర్తి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజి రెడ్డి, కార్పొరేటర్ పుష్ప నాగేష్, పరమేష్ యాదవ్, బేకు యాదయ్య, బల్ల నర్సింగ్, గడ్డం కుమార్, బైకన్ నవీన్ యాదవ్, బల్ల చరణ్, అశోక్, కార్యకర్తలు, బస్తి వసూలు  తదితరులుపాల్గొన్నారు.