17-07-2025 12:42:22 AM
చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కెపల్లి గ్రామం సర్వే నెంబర్ 180లోని 99.14 ఎకరాల్లా ప్రభుత్వం గోశాల ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 10 కుటుంబాలకు చెందిన 26 మంది రైతులకు 300 గజాలకు సంబంధించిన ప్రొసీడింగ్ అందజేయగా .. తాజాగా బుధవారం మరో 5 కుటుంబాలకు చెందిన 15 మంది రైతులకు చేవెళ్ల ఆర్డిఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ ప్రొసీడింగ్స్ అందజేశారు. ఇప్పటికే మొత్తం 16 కుటుంబాలకు చెందిన 46 మంది రైతులకు ప్రొసీడింగ్స్ అందజేశామని మరికొంతమంది రైతులకు గురువారం ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ షాబాద్ దర్శన్ పాల్గొన్నారు.