17-07-2025 12:44:24 AM
జైపూర్, జూలై 16 : మండలంలోని వేలా ల గ్రామంలో వానలు సమృద్ధిగా కురవాల ని బుధ వారం పాండవుల బేరీల ప్రాంగ ణం నుంచి ఒగ్గు పూజారులతో పవిత్ర గో దావరి నది తీరానికి వెళ్ళి పుణ్య స్నానా లు ఆచరించి కడవలతో నీళ్ళు తీసుకొచ్చి గ్రామ దేవతలకు అభిషేకం చేశారు.
గ్రామంలోని గట్టు మల్లికార్జున స్వామి క్షేత్రమైన గట్టు పైన పాండవుల కళ్యాణం నిర్వహించి గాలి పిల్ల ను వదిలిపెట్టారు. గొంతెమ్మ కొలిగుంట వద్ద వరదపాశం పోసి వరుణదేవున్ని వాన లు కురిసి పంటలు పండాలని వేడుకున్నా రు. కార్యక్రమంలో గ్రామంలోని రైతులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.