27 April, 2026 | 3:38 AM

గ్రామ దేవతల చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శన

27-04-2026 01:15 AM

గాంధారి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని సీతాయిపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం రథాల పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గ్రామ దేవతలకు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతల ఆలయాల చుట్టూ గ్రామస్థులు ఎడ్లబండ్ల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించే విధంగా గ్రామంలో ప్రతీ ఏడు ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహిస్తున్నామని గ్రామ పెద్దలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పఠాన్ అంజాద్ ఖాన్, గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్, ఉప సర్పంచ్ లక్ష్మీ కాశీరాం, మాజీ సర్పంచ్ రాజమణి రాజు, మాజీ ఉప సర్పంచ్ సింగసాని పండరి, గ్రామ పెద్దలు చంచల బాలయ్య, రావుల సంగయ్య, దుంపల ఎల్లయ్య, వార్డ్ సభ్యులు గంగ మల్లు, సాయిలు, రాజు,శ్రీరామ్, నవీన్ , గ్రామస్థులు పాల్గొన్నారు.