27 April, 2026 | 3:39 AM

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతి

27-04-2026 01:14 AM

మద్నూర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): మద్నూర్ మండల కేంద్రంలో ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవమైన ధర్మం,దానం,సేవాభావానికి ప్రతీక అయిన  శ్రీ వాసవీమాత‘ జయంతిని అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరుపుకన్నారు. ఇందులో భాగంగా సమస్త ఆర్యవైశ్య సోదర-సోదరీమణులంబరూ, పిల్లాపాపలతో కలిసి ఆర్యవైశ్య సంఘ భవనం నుండి బస్టాండ్ హనుమాన్ మందిరం వరకు భక్తి-శ్రద్ధలతో, సుమధుర కీర్తనలతో, మంగళారతులతో శోభాయాత్రను నిర్వహించారు.

తదనంతరం  ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవమైన శ్రీవాసవీమాత జయంతిని తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన శుభ సందర్భంగా మద్నూర్ ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు వంగపల్లి యోగేష్ ఆధ్వర్యంలో సమస్త ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు సమస్త ఆర్యవైశ్య సోదర-సోదరీమణుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ స్థానిక గాంధీచౌక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.తదనంతరం సామూహిక కుంకుమార్చనతో  శ్రీ వాసవీమాతను పూజించారు,  తదనంతరం సామూహిక ఆరతి నిర్వహించి అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.