27 April, 2026 | 3:38 AM

ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలి : సీపీఎం

27-04-2026 01:17 AM

భిక్కనూర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): భిక్కనూర్ మండల  శివారులోని రాఘవ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు డిమాండ్ చేశారు. కంపెనీ నుంచి వెలువడుతున్న దుర్వాసన, విషవాయువుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

జంగంపల్లి, అంతంపల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమస్య పరిష్కారం కాకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాలయ్య, స్వామి, మల్లయ్య, నరసింహులు, మహిళలు పాల్గొన్నారు.