4 June, 2026 | 5:21 PM

రైతన్న ఆందోళన చెందకు.. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తా: ఎమ్మెల్యే

04-06-2026 04:20 PM

బోథ్, జూన్ 3 (విజయక్రాంతి):  వర్షాల వల్ల తడిసిన ధాన్యం ప్రభుత్వం చేత కొనుగోలు చేపట్టే విధంగా కృషి చేస్తానని రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. గురువారం వర్షాల వల్ల నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో మార్కెట్కు తీసుకువచ్చిన పంటలు తడిసిపోయాయి. అయితే రైతులు ఈ విషయంలో ఆందోళన చెందుతున్న విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే అండగా ఉంటాను అధైర్య పడవద్దు అంటూ భరోసా కల్పించారు. అకాల వర్షాలు నష్టం చేసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనే విధంగా రైతాంగానికి అండగా ఉండి పోరాటం చేస్తానన్నారు. ప్రభుత్వం సహితం రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.