మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
04-06-2026 03:56 PM
మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ వద్ద మక్తల్–నారాయణపేట–కొడంగల్(Makthal–Narayanpet–Kodangal Lift Irrigation Scheme) ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిశీలించారు. మక్తల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పర్యటిస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మక్తల్ పర్యటన జరిగింది. ముఖ్యమంత్రి, మంత్రులు నీటి పారుదల ప్రాజెక్టులపై ఫొటో గ్యాలరీ వీక్షించారు. కాట్రేవుపల్లిలోని మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఎత్తిపోతల పథకం ఫేజ్-1 పనులను రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఎత్తిపోతల పథకం ఫేజ్-1 లో భాగంగా పంప్ హౌస్, కెనాల్ పనులు జరుగుతున్నాయి. పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు.






