17 April, 2026 | 2:29 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

గోండ్ కటిరాతో లాభాలు!

23-03-2025 12:00 AM

గోండ్ కటిరా.. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతారు. ఎండాకాలంలో గోండ్ కటిరా తినడం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. దీంట్లో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది సహజంగా నీటిని పీల్చుకునే లక్షణాన్ని కలిగి ఉంటుంది. గోండ్ కటిరాతో కలిగే లాభాలేంటో చూద్దాం.. 

* ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. 

*దీన్ని షర్బత్, పాలు, స్వీట్లు, ఆయుర్వేద మందు ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది మంచి యాంటీ బయోటిక్‌లా పనిచేస్తుంది. 

* సంతానోత్పత్తిని పెంచడంలో, హార్మోన్ల సమతుల్యతను సరిచేయడంలో గోండ్ కటిరా బాగా పనిచేస్తుంది. 

* దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇది అలసట, బలహీనత నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో వడదెబ్బను నివారించడానికి, శరీరాన్ని చల్లగా ఉంచడానికి గోండ్ కటిరా ఒక అద్భుతమైన సహజ ఔషధం. 

*గోండ్ కటిరా సహజ ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా సమ్మర్‌లో కడుపును చల్లబరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ పేగులను శుభ్రపరచడంలో, సజావుగా పనిచేయడంలో సహాయపడుతుంది. దీన్ని చల్లటి నీటిలో లేదా పాలల్లో కలిపి తాగితే.. అజీర్తి సమస్య దూరం అవుతుంది. 

*ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. చర్మంపై చికాకు, మొటిమలు, పొడిబారకుండా కాపాడుతుంది.