పని లభిస్తేనే ప్రగతి సాధ్యం
26-06-2024 12:05 AM
- నాబర్డ్ సీజీఎం సుశీల చింతల
మహబూబ్‌నగర్, జూన్ 25 (విజయక్రాంతి): ప్రతీ వ్యక్తికి పని లభిస్తేనే ప్రగతి సాధ్యం అవుతుందని నాబర్డ్ సీజీఎం సుశీల చింతల అన్నారు. మంగళవారం దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని గాజులపేట సమీపంలో అధునాతన పరికరాలతో మట్టి పాత్రల తయారీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. మొల్లమాంబ పోటరీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ కేంద్ర నిర్వహణ ఉంటుందన్నారు. ఈ కంపెనీ ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో నాబర్డ్ డీజీఎం శ్వేత, బుగ్గన్న పాల్గొన్నారు.






