అల్ఫా హోటల్ పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు
హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని ఆల్ఫా హోటల్ పై అసత్య ప్రచారాలు చేయడం, అసత్య కథనాలు ప్రచురించడం మానుకోవాలని ఆ హోటల్ యాజమాన్యం కోరింది. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ... సికింద్రాబాద్ లోని పలు హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడు చేశారు. అందులో భాగంగానే అల్ఫా హోటల్ ను తనిఖీ చేసి పలు సూచనలు మాత్రమే చేశారన్నారు. ఇదే సమాచారాన్ని ఎక్స్ లో పోస్టు పెట్టారని తెలిపారు. ఇతర హోటల్స్ సంబంధించిన అపరిశుభ్రమైన కిచెన్ ఫోటోలను జోడించి అవి అల్ఫా హోటల్ కు సంబంధినవి అని అసత్య ప్రచారం చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. రోజుకు 80 వేల మంది ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని అల్ఫా హోటల్ పై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాశాయని వాపోయారు. అల్ఫా హోటల్ పై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు.






