ప్రజల భాగస్వామ్యంతోనే ప్రగతి
చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ యాదగిరి వెల్లడి
చేవెళ్ళ జూన్ 03 (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపాలిటీలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా 1,2,3,4 వార్డుల్లో సభల నిర్వహిస్తామని చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ బి. యాదగిరి ప్రకటనలో చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చెవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో ’99 రోజుల కార్యాచరణ ప్రణళిక సమర్థవంతమైన నిర్వహణకు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు.
భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి నేటి నుండి అన్ని వార్డులలో సభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి. యాదగిరి. ఈ సభలలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలు (SHGs), కమ్యూనిటీ ప్రతినిధులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సభల నిర్వహణకు ప్రత్యేక అధికారులు, వార్డు అధికారులు బిల్ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కమిషనర్ నేడు నిర్వహించే వార్డు సభల వివరాలు వెల్లడించారు. ఊరేళ్ల (వార్డు 1 & 2): ఉదయం 9.00 గంటలకు ఉంటుందని, దేవునిఎర్రవల్లి (వార్డు 3): 10.00 గంటలకు మల్కాపూర్ (వార్డు 4): 11.00 గంటలకు ఆయా వార్డుల ప్రజలు సభలకు హాజరై వార్డుల అభివృద్ధికి సహకరించాల్సిందిగా ఆయన కోరారు.






