పారదర్శక పోలీసింగ్ వ్యవస్థే లక్ష్యం
04-06-2026 01:16 AM
ఎస్పి స్నేహ మెహర
తాండూరు, జూన్ 3, (విజయక్రాంతి): ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్ సేవలను అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి పోలీసు కృషి చేయాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ స్నేహ మెహ్రా అన్నారు. బుధవారం ఆమె వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించారు.
పరిశుభ్రత, కార్యాలయ నిర్వహణ, రికార్డుల భద్రత, సిబ్బంది విధి నిర్వహణ తీరును సీఐ పరమేశ్వర్ తో అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు మరియు పోలీసులకు-ప్రజలకు మధ్య ఎలాంటి అంతరాలు లేకుండా నిరంతరం అందుబాటులో ఉండే విధంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు.






