పేదవాడి హృదయాల్లో అభివృద్ధి సంతకం వైయస్సార్
నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) / అచ్చంపేట / వెల్డండ : అభివృద్ధి అనే సంతకాన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి పేదవాడి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్యులు ఘనంగా నివాళులు అర్పించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అచ్చంపేట పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో వైయస్సార్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. వెల్దండ మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వైయస్సార్ సేవలు చిరస్మరణీయం..
మిడ్జిల్ సెప్టెంబర్ 2 : మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి వద్ద కాంగ్రెస్ పార్టీ సీరియల్ నాయకులు సాయిలు, నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉండగా చేసినటువంటి మహత్తర కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ వంటి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో ఇప్పటికీ అయిన బ్రతికే ఉన్నారన్నారు, అటువంటి మహానుభావులు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గుడ్ల బాలయ్య, వెంకటేష్ గౌడ్, వెంకటయ్య, మల్లికార్జున్ రెడ్డి, ఆదాం, పర్వతాలు, ఉస్మాన్, జహీర్, నర్సింలు, బాలస్వామి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.






