పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలి
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
ఆరుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): పదోన్నతి పొందిన ఎస్.ఐలకు పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని క్రమ శిక్షణతో, బాధ్యతగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ శాఖ పై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పని చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆరుగురు ఏఎస్ఐలకు, ఎస్ఐలుగా పదోన్నతి పొందిన సందర్బంగా జిల్లా ఎస్పీ స్టార్ లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడుతూ... సమస్యను పరిష్కరించే దిశగా పని చేస్తూ తమకు అప్పగించిన విధులను క్రమ శిక్షణతో బాధ్యతతో పని చేయాలని అన్నారు.అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందన అన్నారు.






