పుట్టిన రోజున స్వగ్రామంలో ప్రచారం
మహేశ్వరం, ఏప్రిల్ 5 : చేవెళ్ల చెల్లమ్మగా బ్రాండ్ సొంతం చేసుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సబిత ఇంద్రారెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను ఆదివారం తన స్వగ్రామం కౌకుంట్లలో గ్రామ ప్రజల మధ్య జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం ఆల యంలో పూజలు నిర్వహించి పూజ రి ఆశీర్వాదం తీసుకున్నారు. చేవెళ్ల పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసా ని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను గెలిపించాలని కోరుతూ కార్యకర్తలతో కలిసి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయమని అడిగితే ప్రతి మాటకు విమర్శలు చేస్తూ దేవుళ్లపై ఒట్టుపెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. బీసీబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్‌ను చేవెళ్ల అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణా రెడ్డి, యువ నాయకులు కౌశిక్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
మీర్‌పేట్‌లో మున్సిపల్ కార్పొరేషన్‌లో పుట్టినరోజు వేడుకలు
సబిత ఇంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలను మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లెలగూడ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని సబితా ఇంద్రారెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యా లతో సంతోషంగా ఉండాలని కోరు తూ వెంకన్నస్వామికి 1001 కొబ్బరి కాయాలను కొట్టి మొక్కు చెల్లించా రు. ఈ పూజ కార్యక్రమంలో నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




