రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ
పథకాలే బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయి
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, మే 5 (విజయక్రాంతి): జహీరాబాద్ పార్లమెంట్‌లో రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ పడుతున్నాయని జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇన్‌చార్జ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని పల్వంచ మండల కేంద్రంతో పాటు కామారెడ్డిలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జహీరాబాద్‌లో బీబీ పాటిల్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు అందరూ మద్దతు తెలుపుతున్నారని అన్నారు. పథకాలే బీజేపీని మరోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజంపేటకు చెందిన యువకులు, మహిళలు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్, నాయకులు నరేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆకుల భరత్, మోహన్ రెడ్డి, తేలు శ్రీనివాస్, అంజల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




