3 April, 2026 | 4:20 PM

ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు

03-04-2026 02:41 PM

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఇరాన్ పై బెదిరింపులకు దిగాడు. ప్రపంచంలో అమెరికా సైన్యం(American Army) అత్యంత బలమైందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ లో ఇంకా విధ్వంసం మొదలు కాలేదని సూచించారు. ఇరాన్ లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్ లను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కొత్త నాయకత్వానికి ఏం చేయాలో తెలుసన్న ట్రంప్ అది త్వరగా చేయాలన్నారు. ఇరాన్ తన ఉనికిని కోల్పోకముందే ఒప్పందానికి రావాలని పిలుపునిచ్చారు.

ఇజ్రాయెల్ దాడుల్లో(Israeli attacks) ఇరాన్ మిస్సైల్ యూనిట్ కమాండర్ మక్రం అజిమి మృతి చెందాడు. ఇరాన్ లోని ఖేష్మ్ ఓడరేవుపై భీకర దాడి జరగగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇరాన్ క్షిపణి దాడిలో(Iran Missile Attack) ఇజ్రాయెల్ లోని పెటాటిక్వా నగరంలో ఆటస్థలం దెబ్బతిన్నది. ఇరాన్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్ లోని రమత్ గాన్ లో భవనం కూలిపోయింది. ఎఫ్-35 యుద్ధవిమానాన్ని కూల్చివేశామంటూ ఐఆర్ జీసీ ఫొటోలు విడుదల చేసింది. కువైట్ లోని అల్ అహ్మదీ చమురు శుద్ధి కేంద్రాన్ని(Mina Al-Ahmadi Refinery) ఇరాన్ డ్రోన్లు తాకాయి. గల్ఫ్ దేశాల్లోని 8 వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. తమ భూభాగం నుంచి అమెరికా దాడులు చేయడం లేదని యూఏఈ స్పష్టం చేసింది.