3 April, 2026 | 5:02 PM

గంజాయి సేవించడం నేరం

03-04-2026 03:04 PM

ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాయిడ్

ఖానాపూర్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో పోలీసులు గాంజా గస్తీ కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు పాన్ షాప్లు, కిరాణా షాపులు తనిఖీ చేసి మత్తు పదార్థాలు అమ్మ రాదని యజమానులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎస్సై రాహుల్ గైక్వాయిడ్ మాట్లాడుతూ గంజాయి అమ్మకం సమాచారాన్ని తమకు అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. గంజాయి సేవించడం వల్ల వచ్చే దుష్పరిమానాలను పలువురికి వివరించారు .కార్యక్రమంలో స్థానిక పోలీస్ బృందం, ఆటో డ్రైవర్లు, యజమానులు ఉన్నారు.