3 April, 2026 | 5:08 PM

'మార్పురావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి'— మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

03-04-2026 03:21 PM

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

రెండేళ్లలోనే రేవంత్ రెడ్డి పోవాలి అనే పరిస్థితి

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలు(Jeevan Reddy Comments) సంచలనంగా మారాయి. జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో మార్పు రావాలి.. కేసీఆర్ పోవాలి అని అన్నారు. పదేళ్ల తర్వాత మార్పు వస్తే ప్రస్తుత పరిస్థితి మారిందని పేర్కొన్నారు. రెండేళ్లలో ఇప్పుడు మార్పు రావాలంటే.. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పోవాలి అనే పరిస్థితి వచ్చిందని జీవన్ రెడ్డి వెల్లడించారు. ప్రాణహిత నదీ జలాలను వాడుకోవడంలో రేవంత్ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు.

ఏ పార్టీలో చేరాలనేది అభిమానులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు తనపై ఉన్న అభిమానానికి జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏప్రిల్ 13వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఏప్రిల్ 7వ తేదీన జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 13న పార్టీ చేరిక తర్వాత జగిత్యాలలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ పెట్టాలనే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం.