18 April, 2026 | 10:09 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఉపాధి హామీ పనుల ప్రతిపాదనలు తయారు చేయాలి

08-05-2025 12:00 AM

కామారెడ్డి, మే 7 (విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం క్రింద చేపట్ట నున్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ హాలులో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం క్రింద గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యార్థినిల స్కూల్ టాయిలెట్స్, సి.సి.రోడ్లు, ఫామ్ పాండ్స్ ,తదితర పనులకు రెండు రోజుల్లో ఆయా సంబంధిత అధికారులు మండలాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవన నిర్మాణాలకు అవసరమైన భూములను గుర్తించాలని సూచించారు.

ప్రతీ వారం ఆయా అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, ఇంచార్జీ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, కామారెడ్డి, బాన్సువాడ పంచాయతీ రాజ్ ఈఈ లు దుర్గాప్రసాద్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.