calender_icon.png 8 May, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తా చాటిన భారత సైన్యం

08-05-2025 12:00:00 AM

‘ఆపరేషన్ సిందూర్’తో సంబరాలు జరుపుకున్న మాజీ సైనికులు, ప్రజలు

ఆదిలాబాద్, మే 7 (విజయక్రాంతి): ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన భారత సైన్యానికి మద్దతుగా ఆదిలాబాద్ లో పలు సంఘాలు సంబరాలు జరుపుకున్నా రు.

జమ్మూకాశ్మీర్‌లోని పహేల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల్లో అమాయ కులను హతమార్చి మహిళల నోదుటి సిం ధురాన్ని దూరం చేసిన ఉగ్రవాదుల దాడికి దీటైన జవాబుగానే భారత సైనికులు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడితో ఆదిలాబాద్‌లోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద సనాతన హిందూ ఉత్సవ సమి తి ఆధ్వర్యంలో మాజీ సైనికులు, పట్టణ ప్రజ లు బుధవారం సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా భారత జాతీయ పతాకాలని చేతబట్టి, భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు. టపాసులు కాలుస్తూ సంబ రాలు జరుకుంటూ సైనికులకు మద్దతు పలికారు.  కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి,  సభ్యులు రవీందర్, రేణుకుంట్ల రవీందర్, వేణు, సత్యం, నర్సింలు, మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు శంకర్ దాస్, మాజీ సైనికులు అశోక్ రెడ్డి, దేవన్న, ఎల్వీ రావు పాల్గొన్నారు.