11 March, 2026 | 2:28 AM

ప్రభుత్వ హాస్టళ్లలో వసతుల కల్పనకు ప్రతిపాదనలు

11-03-2026 12:35 AM

ఏప్రిల్ 10లోగా అందించాలని కలెక్టర్ ఆదేశం

సమీక్షలో పాల్గొన్న నిర్మల, జగ్గారెడ్డి

సంగారెడ్డి, మార్చి 10: సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ బాలుర, బాలికల హా స్టళ్లు, హై స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డి గ్రీ కాలేజీలలో బాత్ రూంలు, అదనపు గ దులు, స్వంత భవనాలు, మంచి నీటి వసతుల కల్పన కోసం ఏప్రిల్ 10వ తేదీలోగా ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.

మంగళవారం టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డవతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతుల కల్పన కోసం 60 శాతం పరిశ్రమల సిఎస్‌ఆర్ నిధులతో పాటు 40 శాతం నిధులు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తీ సుకువస్తామని జగ్గారెడ్డి, నిర్మల తెలిపారు.

తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.50 లక్షలు కేటా యిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహిళా డిగ్రీ కళాశాలలో అదనంగా 10 తరగతి గదు లు నిర్మించాలని, బాలికల జూనియర్ కళాశాలలో రూ.75 లక్షలతో ఆడిటోరియం, 10 తరగతి గదులు అందుబాటులోకి తెచ్చేలా మొదటి అంతస్తు నిర్మాణం చేపట్టాలని సూచించారు. తాను కళాశాలలను సందర్శించినప్పుడు హాస్టల్ వసతి లేక చాలామంది అమ్మాయిలు చదువు మానేస్తున్నట్లు గుర్తించానని జగ్గారెడ్డి తెలిపారు.

ఇకపై హాస్టల్ వసతి లేదనే కారణంతో అడ్మిషన్లు తీసుకోలేని పరిస్థితి ఉండకూడదని, సంగారెడ్డి ని యోజకవర్గంలోని అన్ని హాస్టల్లో తగినంత మంది విద్యార్థులకు సరిపడేలా వసతి కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయ న సూచించారు. జూనియర్ కళాశాల, ప్రభు త్వ డిగ్రీ కాలేజీలలో 500 మంది విద్యార్థినీలు ఉండేలా హాస్టల్ నిర్మించాలని నిర్ణ యించారు. బాలుర జూనియర్ కళాశాలలో 12 మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మించాలని ప్రతిపాదించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, అందుకు ఏప్రిల్ 10లోగా అంచనాలు తయారు చేసి ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో కూన సంతోష్, మున్సిపల్ చైర్మన్ వనిత, వైస్ చైర్మన్ షఫీ, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ మునిపల్లె సత్యనారాయణ, వైస్ చైర్మన్ చిరు, నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు, సిడిసి చైర్మెన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రా మ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిద్రుప్ప రఘు గౌడ్, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహరెడ్డి, పార్టీ అధ్యక్షులు జార్జ్, సిద్దన్న, బుచ్చి రాములు, మోతి, కంది సర్పంచ్ శ్రీరామ్ లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.