calender_icon.png 21 February, 2026 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

21-02-2026 12:00:00 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని బాలల హక్కుల కమిషన్ సభ్యుడు బొర్ర పవన్ కుమార్ అన్నారు. అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరితో కలిసి ఆయన భూపాలపల్లి లోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల, అంగన్వాడి సెంటర్, మైనార్టీ బాలుర పాఠశాల, ప్రభుత్వ హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, కాటారం చైల్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ను సందర్శించారు.

బాలల భవిష్యత్తు కోసం, వారి హక్కుల కోసం ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖలు బాధ్యతగా భావించాలన్నారు. హాస్పటల్లో బాల రోగుల బాగోగులు తెలుసుకొని వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు.  ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా చైల్ వెల్ఫేర్ చైర్మన్  అనిల్ చందర్రావు, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, జిల్లా డిఎం అండ్ హెచ్ ఓ మధుసూదన్, డిప్యూటీ సూపర్డెంట్ వెంకటరత్నం, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇందిరా, చైల్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ తిరుపతి పాల్గొన్నారు.