calender_icon.png 21 February, 2026 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాడ్మింటన్ పోటీల్లో ఏసీపీల జోడీకి స్వర్ణం

21-02-2026 12:00:00 AM

వరంగల్ (మహబూబాబాద్) ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోరట్స్ మీట్లో వరంగల్ అధికారులు వివిధ క్రీడా పోటీల్లో సత్తా చాటారు. 55 ఏళ్ల గెజిటెడ్ అధికారుల బ్యాడ్మింటన్ విభాగంలో వరంగల్ కమిషనరేట్కు చెందిన ఏసీపీలు మూల జితేందర్ రెడ్డి, మధుసూదన్ జోడీ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. పదునైన ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తు చేసి ప్రథమ స్థానంలో నిలిచారు.

టేబుల్ టెన్నిస్‌లోతులసీదాస్ కు స్వర్ణం

తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోరట్స్ మీట్లో భాగంగా శుక్రవారం జరిగిన టేబుల్ టెన్నిస్ ఓపెన్ కేటగిరీలో కానిస్టేబుల్ తులసీదాస్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ప్రత్యర్థులపై పైచేయి సాధించి స్వర్ణ పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా పతక విజేతను టీమ్ మేనేజర్తో పాటు సహచర క్రీడాకారులు అభినందించారు.