23 April, 2026 | 3:05 AM

ప్రకృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత

23-04-2026 01:51 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

కట్టంగూరు, ఏప్రిల్ 22: ప్రకృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. వరల్ ఎర్త్ డే సందర్భంగా బుధవారం నకిరేకల్ పట్టణంలోని హైస్కూల్ నుండి మెయిన్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీనీ ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అత్యంత అవసరమన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ఇప్పటినుంచే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ వాసులు పాల్గొన్నారు.