రక్షణ ఏర్పాట్లు చేయాలి
15-05-2024 12:05 AM
కొనుగోలు కేంద్రాలలో రైతుల ధాన్యానికి రక్షణ కరువు కావడం బాధాకరం. ‘తడిసిన ధాన్యాన్ని కొంటారా?’ అంటే దానికి సమాధానాలు వుండవు. ఎటుపెట్టి రైతుల పరిస్థితి అగమ్యగో చరంగా వుంది. మరోవైపు అకాల వర్షాలకు అనేక ప్రాంతాలలో రైతుల పొలాల్లోని పంటలూ నీట మునిగి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నెలల తరబడి ఎండనక కాయకష్టం చేసి పండించిన పంటలను అటు ప్రకృతి నుంచి కాపాడుకోలేక, ఇటు ప్రభుత్వాల నుండి తగిన సహాయం పొందలేక రైతన్నలు కుమిలిపోతున్నారు.
- సులేఖ, కరీంనగర్






