పోలింగ్ పెరగడం ఆనందదాయకం
15-05-2024 12:05 AM
ఓటు వేయడం కోసం ప్రజలు భారీగా తరలి రావడం ఆనందదాయకం. ప్రజలలో ఓటు వేయడం పట్ల అవగాహన పెరుగుతుండటంతోపాటు రాజకీయ స్పృహ ఎక్కువవుతుండటం కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా యువత తమ బాధ్యతను గుర్తిస్తున్నారు. భువనగిరిలో ఓటింగ్ 72.34 శాతంతో అత్యధిక పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది. వృద్ధులతోపాటు ప్రముఖులు, సామాన్యులు సైతం విదేశాల నుంచీ స్వగ్రామాలకు తరలి రావడం అభినందించదగ్గ విషయం.
- ఈశాన్ శ్రీవాత్సవ, ఇటిక్యాల






