9 May, 2026 | 4:35 PM

ప్రజా చైతన్యానికి జేజేలు

15-05-2024 12:05 AM

సోమవారం నాటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ‘.. లేకపోతే పోలింగ్ బహిష్కరిస్తామని’ డిమాండ్ చేసిన సంఘటనలు నమోదు కావడం ఆశ్చర్యకరం. తాగునీరు, వీథిదీపాలు, రోడ్డు సౌకర్యం వంటి కనీస వసతులుసహా ఏకంగా మైనింగ్ తవ్వకాలు ఆపాలని కూడా ప్రజలు నిరసన తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మైలారంలో అక్రమ మైనింగ్ ఆపకపోతే ఓట్లు వేయమని గ్రామస్తులు హెచ్చరించినా, పట్టించుకొనే వారు లేక ఒక్క ఓటూ నమోదు కాలేదు. ఎన్నికలు వస్తేకాని పనులు కావన్న అభిప్రాయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇకనైనా తొలగించుకొంటే మంచిది.

 - జయచంద్ర, భద్రాచలం