లైంగిక అక్రమ రవాణా బాధితులకు రక్షణ
- ‘విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్’ అమలుకు సుప్రీంకోర్టు ఆదేశం
- పార్లమెంటులో చట్టం వరకు అమలులో.. ఫలించిన ప్రజ్వల సంస్థ పోరాటం
న్యూఢిల్లీ, జూన్ 4: లైంగిక అక్రమ రవాణా (సెక్స్ ట్రాఫికింగ్) బాధితుల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ‘ప్రజ్వల’ వర్సెస్ ‘యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో భా గంగా, బాధితుల సంరక్షణ మరియు పునరావాసం కోసం దేశంలోనే మొదటిసారిగా ఒక సమగ్ర ‘విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్’ (బాధితుల రక్షణ ప్రణాళిక)ను కోర్టు రూపొం దించింది. పార్లమెంటు దీనిపై నిర్దిష్ట చట్టం తెచ్చే వరకు ఈ మార్గదర్శకాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
న్యాయమూర్తు లు జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ ఈ చారిత్రాత్మక తీర్పును మే 29న ప్రకటించారు. సునితా కృష్ణన్ (ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు) లైంగిక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న ‘ప్రజ్వల’ సంస్థ తరఫున ఈ కేసు దా ఖలైంది. తీర్పు ముఖ్యాంశాలను ఆమె పత్రి కా ప్రకటన ద్వారా వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమై న జీవితాన్ని పొందడం బాధితుల హక్కు అని, పునరావాసం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని కోర్టు పేర్కొంది.
బాధితులను వస్తువులుగా చూడకుండా, సమాజంలో వా రికి గౌరవం, ఆర్థిక భద్రత కల్పించాలని తెలిపింది. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూ నిట్లు డిఎస్పీ స్థాయి అధికారితో పనిచేయా లి. ఇందులో కనీసం ఇద్దరు మహిళా పోలీసులు, సైబర్ క్రైమ్ అధికారులు ఉండాలి. వీటిని పోలీస్ స్టేషన్లుగా గుర్తించి నెలకు ఒకసారి నిందితులు, బాధితుల డేటాబేస్ సిద్ధం చేయాలి. రక్షించే సమయంలో బాధితులపై ఎలాంటి శారీరక, మానసిక దాడులు చేయకూడదు.
వారిని నిందితులుగా చూడకూడ దు, అరెస్ట్ చేయకూడదు. ఫొటోలు, వీడియోలలో బాధితుల ముఖాలు పడకుండా జాగ్రత్త వహించాలి. బాధితులను పోలీస్ లా కప్లలో ఉంచకూడదు. మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేటప్పుడు తప్పనిసరిగా లీగల్ ఎయిడ్ ద్వారా న్యాయవాదిని కేటాయించా లి. మహిళా పోలీసులే వారి స్టేట్మెంట్ను రికార్డు చేయాలి. ప్రొటెక్టివ్ హోమ్లలో కౌన్సిలింగ్, విద్య, ఉపాధి శిక్షణ ఇవ్వాలి.
బాధితు లు సొంత ఊళ్లకు వెళ్లాలనుకుంటే, అక్కడ మళ్లీ ప్రమాదం పొంచి ఉందో లేదో హోమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. బాధితులపై 3 ఏళ్ల పాటు నిఘా (ఫాలో-అప్) ఉంచాలి. కోర్టుకు రాలేని బాధితుల కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలి. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పార్లమెంటు ఒక సమగ్రమైన ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సుప్రంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సిఫా ర్సు చేసింది. అలాగే ప్రస్తుత ఐటీపీఏ చట్టంలోని సెక్షన్లు 7, 8, 20 ల వల్ల బాధితులే నేరస్థులుగా మారే ప్రమాదం ఉన్నందున వాటిని సవరించాలని కోరింది.






