పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
- దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి.. ఒకరు మృతి
- 20కి పైగా హిజ్బుల్లా సైనిక, ఆయుధ స్థావరాలు ధ్వంసం
బీరుట్, జూన్ 4: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించారు. 20కి పైగా హిజ్బుల్లా సైనిక స్థావరాలను, ఆయుధ డిపోలను ధ్వంసం చేశామని ఐడీఎఫ్ వెల్ల డించింది. అమెరికా ప్రతిపాదనలతో ఇజ్రా యెల్ లెబనాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హిజ్బుల్లా తిరస్కరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది.
అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రా యెల్, లెబనాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి కొన్ని గంటల్లోనే గండిపడింది. దక్షిణ లెబ నాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం జరిపి న డ్రోన్ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పో యారు. ఈ విషయాన్ని లెబనాన్ అధికారిక మీడియా గురువారం ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ వైమానిక దళం దక్షిణ లెబనాన్ లోని తైర్, అల్-మన్సూరి, బేట్ యాహూన్, బెకా వ్యాలీలోని లబాయా ప్రాంతాలపై గురువారం ఈ వినాశకర దాడులు చేసింది.
హిజ్బుల్లాకు చెందిన 20కి పైగా సైనిక స్థావరాలను, ఆయుధ డిపోలను తాము ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. అమెరికా మద్దతుతో కుదిరిన ఈ శాంతి ఒప్పందాన్ని ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా గ్రూప్ గురువారం పూర్తిగా తిరస్కరించింది. లెబనా న్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్తేనే తాము ఏ ఒప్పం దాన్నయినా ఒప్పుకుంటామని హిజ్బుల్లా స్పష్టం చేసింది.
ఈ మేరకు తమ నిర్ణయాన్ని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్‌కు అధి కారికంగా తెలియజేసింది. యుద్ధం వల్ల నష్ట పోయిన తమ ప్రజలకు పునరావాసం కల్పించి, ఖైదీలను విడుదల చేస్తేనే తాము వెనక్కి తగ్గుతామని పేర్కొంది. తాము ఈ చర్చల్లో భాగస్వాములం కాదని హిజ్బుల్లా ప్రకటించింది. మరోపక్క ఈ అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్‌నకు సొంత దేశంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఇరాన్ యుద్ధంలో అధ్యక్షుడి సైనిక అధికారాలను పరిమితం చేస్తూ ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్ర జెంటేటివ్స్) గురువారం ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ యుద్ధ ఉద్రి క్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. విమాన ఇంధన ధరల పెరుగుదల నుంచి దేశీయ విమానయాన సంస్థలను రక్షించడానికి భారత ప్రభుత్వం రూ.100 బిలియన్లను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.






