ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా
ఇంజక్షన్ వికటించి మహిళ మృతి చెందిందని బంధువుల ఆరోపణ
మేడ్చల్, జూన్ 12 (విజయక్రాంతి): చిన్న గాయానికి ఆసుపత్రికి వెళితే ఇంజక్షన్ ఇవ్వడంతో అస్వస్థతకు గురై మరణించిందని, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు మృతదేహంతో అల్వాల్ లోని ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అల్వాల్ సిటిజన్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభావతి (50) చూపుడు వేలుకు గాయం కావడంతో స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లారు.
సిబ్బంది ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే గుండెపోటుతో ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయింది. ఆస్పత్రి యాజమాన్యం సూచన మేరకు మరో ఆసుపత్రికి తరలించగా రెండు రోజులపాటు చికిత్స పొంది మరణించింది. మహిళ మృతికి అల్వాల్ లోని ఆసుపత్రి వారు ఇచ్చిన ఇంజక్షన్ యొక్క కారణమని ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. పోలీసులు వచ్చి శాంతింప చేశారు.






