15 June, 2026 | 7:46 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

పవిత్ర రంజాన్ మాసంలో ప్రభుత్వం ద్వారా మౌలిక సౌకర్యాలు కల్పించండి

17-02-2026 07:38 PM

ముకరంపుర,(విజయక్రాంతి): 19వ నుంచి పవిత్రమైన రమజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో  నగరంలోని అన్ని మస్జిదుల వద్ద, ముస్లిం కాలనీల్లో అధికారులు చేయాల్సినటువంటి ఏర్పాట్లపై కరీంనగర్ ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ కోరారు.

ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ కు, జిల్లా సీపీకి, నగరపాలక సంస్థ కమిషనర్ కు, జిల్లా ట్రాన్స్కో ఎన్పీడీసీఎల్ ఎస్ఈలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ,  జాయింట్ సెక్రటరీలు హాఫీజ్ యూసుఫ్, ఆతిన, కోశాధికారి ఇబ్రహీం, కార్పొరేటర్లు మొహసీన్ మొహియుద్దీన్, మాజిద్ హుస్సేన్,  నాయకులు బాబుజానీ, అరిఫ్ అహ్మద్, తాజుద్దీన్, షబ్బీర్, శ్రీనివాస్, రాజు, సురేశ్, సుధాకర్, అక్బర్, వాజిద్ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు.