calender_icon.png 20 February, 2026 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

20-02-2026 07:48:05 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు.శుక్రవారం జిల్లాలోని తిర్యాణి మండలం చింతపల్లి గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టిక, ఆసుపత్రి వార్డులు, ఔషధ నిల్వలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆలస్యంగా హాజరయ్యే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, వైద్యులు విధుల్లో అందుబాటులో ఉండాలని సూచించారు.

అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, బోధన విధానం, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాస సామర్థ్యాలను తెలుసుకున్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మండల విద్యాధికారి అంజయ్యను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున ప్రత్యేక తరగతులు నిర్వహించి 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించి, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.