calender_icon.png 20 February, 2026 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ లో చెట్లను తనిఖీ చేసిన కామారెడ్డి డివిజన్ ఆఫీసర్

20-02-2026 07:52:56 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మెదక్ నుండి ఎల్లారెడ్డి నేషనల్ హైవే రోడ్డు పనుల్లో భాగంగా నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బంజారా గ్రామం నుండి తాండూర్ గేటు వరకు ఉన్నటువంటి ఫారెస్టులో గల చెట్లను కామారెడ్డి ఫారెస్ట్ డివిజినల్ ఆఫీసర్ రామకృష్ణ తనిఖీ చేశారు. అలాగే తాండూర్ గేటు సమీపంలో గల ఫారెస్ట్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్లో గల 11వేల ఒక్క వంద సుమారు మొక్కలను పరిశీలించి ప్లాంటేషన్లోని మొక్కలన్ని బాగున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రానున్న వేసవికాలం సందర్భంగా ప్లాంటేషన్లోని మొక్కలు సంరక్షణ సక్రమంగా చేపట్టాలని నాటిన ప్రతి మొక్కను బ్రతికించాలన్నారు. మొక్కలకు సరిపడా నీటిని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాసుదేవ్, సిబ్బంది ఉన్నారు.