24 July, 2026 | 4:09 PM

రెడ్డి సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వండి

24-07-2026 03:38 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్ రెడ్డి సంక్షేమ సంఘం నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ సంఘం ప్రతినిధులు శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు సానుకూలంగా స్పందించారు. భవన నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భగత్‌నగర్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కసిరెడ్డి రాజి రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్లయ్యగారి ఇంద్రా రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.