మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు
గుండాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్, పార్టీ సీనియర్ నాయకులు గడ్డం వీరన్న ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు సూచనతో మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని అన్నారు.
ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి టి రాము, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నాయకులు జాడి ప్రభాకర్, తాటి కృష్ణ, పొంబోయిన సుధాకర్, బొమ్మెర్ల శ్రీను, గొగ్గెల రమేష్, కొమ్మర్ల పద్మారావు, బొమ్మెర్ల సతీష్, గాంధార్ల కిరణ్, గుగులోతు కాలు, జి రాంబాబు, బొమ్మెర కృష్ణ, గుగులోతు వీరు తదితరులు పాల్గొన్నారు.






