19-12-2025 01:40:10 AM
కలెక్టర్‌కు రైతుల విన్నతి
కడ్తాల, డిసెంబర్ 18 ( విజయ క్రాంతి): కాయకష్టం చేసుకుని బతికే రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని గ్రీన్ ఫీల్ భూ నిర్వాసితులు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆవరణలో డిప్యూటీ కలెక్టర్ రాజు సమక్షంలో కడ్తాల మండలం ముదివెన్ రెవెన్యూ గ్రామాల రైతులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు పాలకూర్ల కర్ణాకర్ గౌడ్, ఈర్లపల్లి రవి లు బాధిత రైతులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను సర్పంచులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఏళ్ల తరబడి భూమినే నమ్ముకుని రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి ప్రాజెక్టులకు రైతుల పక్షాన తాము అండగా ఉంటామని... గ్రీన్ ఫీల్ భూ నిర్వాసితులకు మొదటి ఫేసులో కేటాయించిన పరిహారం మాదిరిగానే ముదివిన్ రెవెన్యూ గ్రామాలు ఎక్వాయి పల్లి మర్రిపల్లి గ్రామాల రైతులకు అందించాలని కలెక్టర్ ను కోరారు. ప్రభుత్వం బాధిత రైతులకు ఒక ఎకరాకు రూ. 25 నుంచి 30 లక్షలు, 121 గజాల ప్రభుత్వ స్థలం పరిహారం అందించేందుకు ప్రస్తుతం సుముఖంగా ఉందని కలెక్టర్ తెలిపారు.
రైతులు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్ రోడ్డు ఏర్పాటు కావడంతో భవిష్యత్తులో తమ ప్రాంత భూముల విలువ పెరుగుతుందని దానిని నువ్వు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని రైతులు పేర్కొన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంచి పరిహారం అందేలా తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు బాలమణి నారాయణ, మల్లయ్య శంకర్ జంగయ్య, సుమన్ హరీష్ యాదయ్య చంద్రయ్య జంగయ్య మహేష్ పాల్గొన్నారు.