20 March, 2026 | 6:09 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

పేదవిద్యార్థులకు వసతుల కల్పన

29-07-2025 12:00 AM

మహబూబాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఖాసిం తండా ప్రభుత్వ పాఠ శాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా దాతలు సకల సౌకర్యాలు కల్పించారు. ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యా ర్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యా ర్థులకు అవసరమైన సౌకర్యాలను దాతలు సమకూర్చారు.

పాఠశాల హెడ్మాస్టర్ పోలోజు మంజుల, రమేష్ సహకారంతో 9 వేల రూపాయల విలువైన ఏకరూప దుస్తులు, స్కూల్ బ్యాగులు అందజేశారు. అలాగే రమేష్ రాథోడ్ అనే దాత ఐదువేల రూపాయల ఖర్చుతో పాఠశాలకు సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. 30 మంది విద్యా ర్థులకు మరో దాత హేమ నాయక్ స్టీల్ ప్లేట్లు అందజేశారు. అలాగే వినోద్ కుమార్ అనే దాత విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు.

పాఠశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ. రవీందర్ రెడ్డి, మండల విద్యాధి కారి బాలాజీ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాల విద్యార్థుల లేమితో మూతపడే దశలో ఉండగా, హెడ్మాస్టర్ మంజుల ఇంటింటికి తిరిగి పాఠశాల లో విద్యార్థులు చేర్చే విధంగా కృషి చేశారు.