20 March, 2026 | 7:51 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఆలయాలకు శ్రావణ శోభ

29-07-2025 12:00 AM

మహబూబాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. దీనితో ఉమ్మడి వరంగల్ జిల్లా లోని పలు దేవాలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కోట గుళ్ళు గణపేశ్వరా లయంలో శ్రావణ మాసం వేడుకలు ఘనంగా ప్రారంభించారు.

ఉదయం గణపతి పూజ, నందీశ్వరునికి అభిషేకం, గణపేశ్వర స్వామికి రుద్రాభిషేకం, పార్వతీ పరమేశ్వరులకు ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అర్చకుడు నాగరాజు భక్తులకు ఆశీర్వచనం, తీర్థప్రసా దాలు అందజేశారు. ఇక మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాల యానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం నుండి స్వామివారిని దర్శించు కునేందుకు బారులు తీరారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప, వేయి స్తంభాల దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయాయి.