28 June, 2026 | 1:56 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

వాహనదారులకు హెల్మెట్లు అందజేత

27-02-2026 12:44 AM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల, ఫిబ్రవరి 26: ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు లు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని ఐడీఓసీ కార్యాలయం ఎదుట ‘అ రైవ్ అలైవ్’ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస రావు లు మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కేవలం నినాదం కాదని, ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలనే సామాజిక బాధ్యతను గుర్తు చేసే ఉద్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం కుటుంబాలకు తీరని లోటని అందువల్ల ప్రతి వాహనదారుడు రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. హెల్మెట్ ధరించడం చలానా భ యంతో కాదని,ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని స్పష్టం చేశారు.

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా మా నుకోవాలని,అతివేగం,రాంగ్ రూట్ డ్రైవింగ్,మొబైల్ ఫోన్ వినియోగం వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.సేఫ్టీ ఫస్ట్ మీ కోసం మీ కుటుంబ సభ్యులు ఇం టివద్ద ఎదురుచూస్తున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని ప్రతి ప్రయాణం జాగ్రత్తగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మొగలయ్య,సి.ఐ టంగుటూరి శ్రీను, ట్రా ఫిక్ ఎస్త్స్ర బాల చంద్రుడు, పోలీస్ సిబ్బంది,వాహనదారులు,తదితరులు పాల్గొన్నారు.